Our Objective

మిత్రులందరికీ నమస్కారములు ...శుభాభినందనలు..

నేను (జగదీష్ కండ్రేగుల శ్రీ భాగీరధ ఆర్గానిక్ ఫాం డైరెక్టర్)..

మహిళలు మహా రాణులు అని ఊరికే అన్నారా..నిజం మహిళలు ఎప్పుడు మహా రాణులే...పూర్వకాలంలోఅయితే వంటింటికే పరిమితమయిన మహిళ నేడు ప్రతి రంగంలోనూ తనేంటో నిరూపించు కుంటుంది... స్త్రీని ఒక శక్తి గుర్తించి ఆమెకు నీరాజనాలు అర్పిస్తున్నాం మనము ..ఆ శక్తిని ఎప్పటి కప్పుడు సరి అయిన క్రమంలో ఉపయోగించుకుంటూ..ఇటు కుటుంబానికి..అటు సమాజానికి మేలు జరిగేలా చూసుకోవాలి..

ఈ మద్య కాలంలో ఒక రంగం అనే కాదు..రాజకీయంగా..వ్యాపార పరంగా కూడా మహిళ తన సత్తా చూపించు కుంటుంది.. అయినా కూడా ..చిన్న చిన్న ఇబ్బందులు ..వాటివల్ల చేయాలనుకుంటున్న పనులు సరియిన విదంగా చేయలేక పోతున్నారు....అందుకే నా వంతు సాయంగా రాజకీయంగా..గాని వ్యాపార రంగంలో కానీ మహిళ విజయ పధంలోనికి దూసుకుపోవాలి అనే సదుద్దేశంతో ..నిష్టాతులయిన ప్రముఖులతో సంప్రదించి సేకరించిన సమాచార విషయాలను మీ అందరికీ పంచాలని..రాజకీయరంగంలో ప్రవేశించాలని ..ఉన్నా..ఏదేని వ్యాపారం చేయాలని సంకల్పించినా . మీకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ....మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తూ..మేము ఇచ్చే సూచనలని అందుకుని ..మీ మీ రంగాలలో అత్యున్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను

ఇంటిలో ఇల్లాలు చదువుకున్నది అయితే..ఆ ఇల్లు బాగుపడుతుంది..అదే మహిళ ఉపాద్యానికి అయితే...విద్యారంగం ..అందులో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకుంటారు...అట్లాగే ఒక మహిళ రాజకియరంగలో గాని ..వ్యాపార రంగంలో గాని అడుగు పెడితే...ఆ ఊరు ..ఆ దేశం..ఆ వ్యాపార సంస్ట ..ఏంతో ప్రగతిని సాధిస్తాయి..ప్రపంచ చరిత్రలో మన దేశ మహిళలు కూడా స్థానం పొందుతారు..

అందుకు ఉదాహరణ మన ప్రియతమ ప్రధాన మంత్రిగా దేశాన్ని ఒకే తాటిపై నడిపించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు..వారికి వారసత్వంగా వచ్చిన రాజసం అయినా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటూ ..ప్రజలందరికీ న్యాయం జరిగేలా పరిపాలించారు ..

నేటి సమాజంలో కూడా ఎందరో మహిళలు తమలో ఎన్నో చేయగలిగే శక్తి..ఆకాంక్ష ఉన్నా ...తమని తామే గుర్తించుకోలేక..గుర్తింపును చేయించు కోలేక..సమయాన్ని వృదాగా గడిపేస్తూ ఉన్నారు..అందుకే ..నేను నా స్నేహితులతో చర్చించి..ఇటువంటి మహిళకు వారి వారి అభిరుచులకు అనుగుణంగా వారిలోని అత్మనూన్యతా భావాన్ని తొలగించి..తమని తాము ఆత్మ విమర్శ చేసుకుంటూ..తమలోఅంతర్గతంగా దాగిన ఉత్సాహాన్ని ..వెలికి తీసి ..వారిని నవ సమాజ..సమ సమాజ నిర్మాణ సారధులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే.. ఉన్నత కుటుంబంలోని మహిళలే కాదు..ప్రతి ఒక్కరు అతి సాధారణ గృహిణులు కూడా రాజకీయ రంగం వైపు ఆలోచించ వచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ...ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా ...రాజకీయాల్లోకి ఏవిదంగా రావాలి..ఎలా మెలగాలి ..అన్న విషయాలపై అవగాహన కల్పిస్తూ...సలహాలు ..సూచనలు ఇవ్వడం జరుగుతుంది..అందుకే ఈ అంతర్జాల (వెబ్ సైట్ ) కక్ష ను మీ ముందు ఉంచటం జరిగింది...ఇందులో విషయాలను సమగ్రంగా చదువుతూ..పరిజ్ఞానాన్ని పెంచుకుని..ఉత్సాహవంతులయిన మహిళలు ముందుకు వచ్చి తమ సేవలను సమాజానికి అందిస్తారని ...ఉత్తమ మహిళగా చరిత్ర పుటలలో స్థిరస్థాయిగా మిగిలి ఉంటారని ఆశిస్తూ ...

How To Apply

Please apply womens those who are interested

Registration Form
News Articals